ఈఎస్ఐ స్కామ్ విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు...
posted on Oct 9, 2019 @ 12:54PM
ఇటివల అందరిలో హాట్ టాపిక్ గా మరిన అంశం ఈఎస్ఐ స్కామ్ .ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని విచారిస్తోంది. అధికారుల విజ్ఞప్తి మేరకు నిందితులను రెండ్రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు మెడికల్ స్కాన్ లో తనిఖీ లు కొనసాగిస్తున్న ఏసిబి అధికారులు మరి కొంత మందిని అరెస్టు చేయనున్నారు. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఏసీబీ దూకుడు మరింత పెంచింది ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురి ని విచారిస్తోంది అధికారుల విజ్ఞప్తి మేరకు నిందితుల్లో రెండ్రోజుల పాటు కస్టడీ కి అనుమతిచ్చింది కోర్టు.పూర్తి అవినీతి కేసుకు సంబంధించిన ఈఎస్ఐ అధికారుల దర్యాప్తు వేగవంతమవుతోంది. ఇప్పటికే కేసులో ఉన్నటువంటి నిందితుల్ని ఈ రోజు ఏసీబీ అధికారులు కస్టడీ లోకి తీసుకొని రెండు రోజుల పాటు విచారించనున్నారు. రెండ్రోజుల పాటు విచారిస్తే మరిన్ని అవకాశాలుమరియు ఎంత మందికి సంబంధించిన ఎటువంటి వివరాలైన వెల్లడయ్యే అవకాశముందని ఏసీబీ అధికారులు గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న రోజుకో కొత్త విషయం వెలుగు చూడటం స్కామ్ కు సంబంధించి ఈ సొమ్ము ను బ్లాక్ మార్కెట్ లోకి కొల్లగొట్టాలన్నది ఒక్కొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి.హెల్త్ క్యాంప్ లో జరిగిన వంటి అక్రమాలకు సంబంధించినటువంటి కిట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని కోట్ల రూపాయల అనుకున్నారన్నది నిందితులందరిపైనా ఉన్నటువంటి ఆరోపణ.దీనికి సంబంధించినటువంటి విషయాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.
గత రెండు మూడు రోజుల క్రితం జరిగిన శోదాల్లో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పద్మ పేరుపైనే ఏకంగా బినామీ కంపెనీలు ఉండటంతో అధికారులు నివ్వెరపోయారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని మొదట భావించినా ఏకంగా బినామీ కంపెనీలను సృష్టించి ఏపీకి సంబంధించినటువంటి మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు దండుకున్నారని ఇటు దేవికారాణి పద్మల కు సంబంధించి వారిపై ఉన్న అభియోగాలున్నాయి. వీరిద్దరినీ విచారిస్తే ఒక్కొక్కరిగా ఇటు ఫార్మా కంపెనీల నుంచి మెడికల్ సిబ్బందులు,డిస్పెన్సరీలల్లోనీ సభ్యులు, మెడికల్ ఏజెన్సీల అభ్యర్దులు,అటు డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్ ఇలా చాలా మందికి ప్రమేయం ఉండటంతో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఇందులో పదమూడు మంది నిందితులు అరస్టయ్యారు ఈరోజు మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి తర్వాత కూడా అరస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాలా మంది అనుమానితులను చుట్టుముట్టబోతున్నరు అధికారులు కోటపల్లి ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఈ స్కామ్ లో ప్రత్యక్షంగా పరోక్షం గా సంబంధాలు ఉన్నాయా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ విచారణలో చాలా వరకు నిజాలు బయటకు రాబోతున్నాయి. మొత్తం మీద ఈ స్కామ్ లోని అసలు నిందితులు బయటకు రాబోతారా లేదా అన్నది చర్చనీయంశం అయ్యింది.