ఒక్క టీ.. నిండు ప్రాణం తీసింది..
posted on Mar 31, 2021 @ 2:16PM
పొద్దున్నే టీ కావాలి . అది తాగితేనే డే స్టార్ట్ అవుతుంది. అది పట్నం లో ఉన్న వాళ్ళైనా పల్లెలో ఉన్న వాళ్ళైనా. కొంత మంది అయితే గంట కొట్టినట్లు .. గంటకో టీ తాగుతారు. కానీ ఈ వార్త చదివాకా టీ వింటేనే మీకు వణుకు పుడుతుంది.
రోజు లాగే ఆమె టీ పెట్టింది. ఇంట్లో ఉన్న ముగ్గురికి టీ ఇచ్చింది. ఇక అంతే. ఆ టీ తాగిన కొద్దిసేపటికి ఒకతను మరణించాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. టీ తాగితే ప్రాణం పోవడం ఏంటని అనుకుంటున్నారా..
పొలంలో రైతులు చేనుకు చల్లే గుళికలు టీలో వేసింది ఆమె. బచ్చన్నపేట మండలం రామచంద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ టీపొడి అనుకుని టీలో ఎండ్రీన్ గుళికలు వేసింది. ఆ టీ తాగిన వారిలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో దాసరం అంజమ్మ (60) అనే మహిల మృతి చెందింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరీకి తరలించారు. దాసరం మల్లయ్య(70), దాసరం భిక్షపతి (60) ల పరిస్థితి విషమంగా ఉంది. ఆ మహిళా కావాలనే నిజంగానే పొరపాటు పడి టీ లో గుళికలు కలిపిందా..? లేక పొరపాటు గానే కలిపిందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.