కరాచీ పార్టీల్లోనే అలవాటయింది...కొకైన్ వ్యసనం పై అక్రమ్
posted on Oct 30, 2022 @ 11:18AM
వసీం అక్రమ్ తన కొత్త పుస్తకం సుల్తాన్: ఎ మెమోయిర్ లో తన కొకైన్ వ్యసనం గురించి అత్యంత ఆశ్చర్యకర విషయాన్ని వెల్ల డించాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆటలోని గొప్ప ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. 1984లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసిన అక్రమ్, తర్వాత 19 ఏళ్లపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు, 2009లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అతనిని అధిగమించే వరకు వన్డేల్లో అత్యధిక వికెట్లు (502) సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. టెస్టు ల్లో, అక్రమ్ పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 104 మ్యాచ్‌లు ఆడి 25 ఐదు వికెట్లతో 414 వికెట్లు తీశాడు. మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 1992 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో పాకిస్తాన్ కు మొదటి టైటిల్‌ను అందించాడు. ఎంతో ఉన్నతస్థాయి లెఫ్ట్ఆర్మ్ పేసర్‌గా అన్ని దేశాల్లో అభిమానులను సంపాదించు కున్నాడు.
అక్రమ్ పాకిస్తాన్ క్రికెట్‌లోని లెజెండ్‌లలో ఒకరిగా రిటైర్ అయినప్పుడు, మాజీ క్రికెటర్ ఇప్పుడు తన ఆట తర్వాత కెరీర్‌లో చీకటి దశ గురించి ఒక ప్రధాన అంశాన్ని బహిర్గతం చేశాడు. ప్రస్తుతం 56 ఏళ్ల అక్రమ్ తన పదవీ విరమణ తర్వాత కొకైన్‌కు బానిసై నట్లు అంగీకరించాడు. అతను దాన్నుంచీ బయటపడేందుకు ఎంతో ప్రయత్నించానని కానీ ఫలితం లేకుండా పోయిందనీ అన్నాడు. తాను ఎప్పుడూ ఎంతో ఆనందంగా గడపాలనే అనుకుంటానని, పార్టీలంటే యిష్టపడతానని అన్నాడు. అయితే దుర దృష్ట మేమంటే దక్షిణాసియాలో కీర్తి సంస్కృతి అంతా అవినీతిమయమైనదన్నాడు. మీరు రాత్రికి పది పార్టీలకు వెళ్లవచ్చు ఎవరూ ప్రశ్నించరు, కొందరు అలా చేస్తుంటారని, అది తనపై ప్రభావం చూపిందని, ఆ అలవాట్లే దుర్గుణాలుగా మారాయ న్నాడు. అన్నింటికంటే చెత్తగా, కొకైన్‌పై ఆధారపడటాన్ని పెంచుకున్నానన్నాడు. ఇంగ్లండ్‌లోని ఒక పార్టీలో నాకు లైన్‌ను అందించినప్పు డు ఇది చాలా హానికరంగా ప్రారంభమైంది; నా ఉపయోగం క్రమంగా తీవ్రంగా పెరిగింది, అది పని చేయడానికి నాకు అవసరమని నేను భావించానని అక్రమ్ వెల్లడించాడు.
తన వ్యసనం రహస్యంగా కరాచీకి వెళ్లి పార్టీ చేసుకునే స్థాయికి చేరుకుందని అక్రమ్ వెల్లడించాడు. అక్రం అప్పటి భార్య హుమా తనకు తెలుసునని, ఈ సమయంలో తరచుగా ఒంటరిగా ఉండేదని, ఆమె కరాచీకి వెళ్లాలని, తన తల్లిదండ్రులు, తోబుట్టు వులకు దగ్గరగా ఉండాలని తన కోరిక గురించి మాట్లాడేదని, తాను అయిష్టపడేవాడినని అక్రమ్ వెల్లడించాడు. అంతెందుకు, కరాచీకి వెళ్లడం తనకు బాగా నచ్చినందువల్ల ఏదో పనిమీద వెళుతున్నట్టుగా, పార్టీల గురించి తరచూ రోజుల తరబడి వెళ్లడం అలవాటయిందన్నాడు పాక్ మాజీ పేసర్.
కానీ తన భార్య హూ్యమా చివరికి తెలుసుకుందని, వాలెట్‌లో కొకైన్ ప్యాకెట్ చూడడంతో అడ్డంగా దొరికిపోయానన్నాడు. కొకైన్ ను దూరం చేసిందని, ఆ అలవాటును నియంత్రించలేకపోయానన్నాడు. తిండి, నిద్రకు కరువై విపరీతమైన తలనొప్పితో చాలా బాధపడ్డానన్నాడు. రిహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లాడు, కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయిందట. తర్వాత ఆయన భార్య హ్యూమా దురదృష్టవశాత్తూ జబ్బునపడి మరణించారు. దాంతో అక్రమ్ జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఆమె అతన్ని డ్రగ్స్‌కు దూరం చేయడంలో చేసిన నిస్వార్ధ సేవ అతన్ని కదిలించేసింది. ఊహించనంతగా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఇపుడు మంచి వ్యక్తిగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు.