ఇదే రిపీట్ అవుతుంది.. అమెరికాకు ఆల్‌ఖాయిదా హెచ్చరిక...
posted on Sep 10, 2016 @ 11:30AM
9/11 ఈ డేట్ పేరు చెప్పగానే మనకు అమెరికాలోని ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన సంఘటన గుర్తుకొస్తుంది. ఈ ఘటన జరిగి దాదాపు 15 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి దాడులే మళ్లీ జరుగుతాయని అగ్రరాజ్యమైన అమెరికాను హెచ్చిరించారు ఉగ్రవాదులు. నిన్నటితో ఈఘటన జరిగి 15 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆల్‌ఖాయిదా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆల్‌ఖాయిదా చీఫ్ అయిమన్ అల్-జవహరీ మాట్లాడుతూ.. ‘‘మాపై మీ నేరాలకు ప్రతీకారంగానే 9/11’’ దాడి అని..ఇది ఇలాగే కొనసాగితే 9/11 లాంటి ఘటనలు వేలసార్లు చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. అరబ్, ముస్లిం దేశాలల్లో భూములను ఆక్రమించుకుంటూ నేరపూరిత, లంచగొండి ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఇస్తోందని ఆరోపించాడు. ఉగ్రవాదులందరూ ఏకం కావాలని కోరిన ఆల్‌ఖాయిదా చీఫ్ ఆఫ్రికన్ అమెరికన్లను ఇస్లాంలోకి మారాల్సిందిగా సూచించాడు. కాగా 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిలో 2,753 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.