కరోనా కోరల్లో తెలంగాణ..
posted on Apr 1, 2021 @ 10:09AM
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 59,297 కరోనా నిర్ధరణ టెస్టులు నిర్వహించగా.. కొత్తగా 887 కరోనా కేసులను గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతిచెందారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1701కి చేరింది. కరోనా నుంచి మరో 337 మంది బాధితులు కోలుకోగా. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,02,10,906కు చేరింది.
ఇది ఇలా ఉండగా తాజాగా జగిత్యాలలో ఒక్కరోజే 101 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మెట్‌పల్లి పట్టణంలో 26 మందికి కరోనాగా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 309 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.