ఇద్దరిపై 8 మంది అత్యాచార*
posted on Apr 1, 2021 @ 12:05PM
విశాల భారతం లో నిత్యం విషాదాలే.. ఎక్కడ చూసిన ఏమున్నది స్త్రీ జాతి కన్నీరు తప్పా.. స్త్రీ నెత్తురు నెల తడపడం తప్పా.. ప్రేమ పేరుతో ఒకడు. స్నేహం మాటున మరొకడు. పేరు ఏదైనా, పేగు బంధం ఏదైనా, పరిచయం ఏదైనా.. అమ్మాయిలపై నిత్యం వంచనే.. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఎనిమిది మంది కామవంచకు బలిఅయ్యారు.
ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సాయంత్రం పూట అలా ద్విచక్రవాహనంపై కాలక్షేపానికి బయటకు వెళ్లారు. కట్ చేస్తే సినిమా లో సీన్ లా కొంత దూరం వెళ్లాక మరో ఆరుగురు.. వేరే వాహనాలపై వచ్చి వారితో కలిశారు. అంతా కలిసి రాత్రి ఏడున్నర గంటల సమయంలో బాలికలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. ముందే పధకం వేసుకున్న దుర్మార్గులు అమ్మాయిలపై సామూహికంగా అత్యాచార* చేశారు. బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. భయపడిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులతో కలిసి ఘటనా ప్రదేశానికి వెళ్లిన తల్లిదండ్రులు.. దారుణమైన స్థితిలో ఉన్న బాలికలను చూసి కన్నీరుమున్నీరయ్యారు . అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రము లోని ఖౌవాయి జిల్లాలో జరిగింది.