50 ఇళ్లు ధ్వంసం చేసిందేవరో తెలుసా?
posted on Dec 11, 2022 @ 11:52AM
ఒక గుంపు ఏకంగా 50 ఇళ్లను ధ్వంసం చేసేసింది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా కడలూరులో ఈ దారుణం జరిగింది. దీంతో ముందు ముందు ఇంకెన్ని ఇళ్లను ఆ గుంపు ధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన ప్రజలలో వ్యక్తమౌతోంది. ఆ గుంపు జనావాసాల మధ్యలోకి రాకుండా అవసన చర్యలు తీసుకోవాలని జనం అధికారులను వేడుకుంటున్నారు.
ఇంతకీ ఇళ్లను ధ్వంసం చేస్తున్నది ఒక ఏనుగుల గుంపు. కడలూరు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగుల గుంపు జనావాసాలపై పడి ఇళ్లను ధ్వంసం చేసింది. స్థానికులు ఇళ్లకు కాపాడు కోవడం సంగతి పక్కన పెట్టి ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఏనుగుల గుంపు వెళ్లిపోయిన తరువాత వచ్చి చూస్తే ఏముంది.. దాదాపు 50 గృహాలు పూర్తగా ధ్వంసమయ్యాయి.
ఆ ఏనుగుల గుంపు మళ్లీ మళ్లీ జనావాసాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. అధికారులు అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామనీ, అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే జనావాసాలకు సమీపంలో అటవీ ప్రాంతం నుంచి ఏనుగులను దూరంగా వెళ్లేలా మళ్లించారు.