కేరళ సీఎం కుర్చీపై మంతనాలు..
posted on May 19, 2016 @ 11:47AM
కేరళలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలను రివర్స్ చేసి ఎల్డిఎఫ్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసింది. ఇక గెలుపు ఎల్డిఎఫ్ దే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్పుడే సీఎం కుర్చీ ఎవరు చేపడుతారు అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపు నుండి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సిపిఎం నేతలు విఎస్ అచ్యుతానందన్ (92), పిన్రాయ్ విజయన్‌లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. విఎస్ అచ్యుతానందన్ పాలక్కాడ్ జిల్లాలోని మలంపుఝ నుండి ఆధిక్యంలో ఉండగా ఇక పిన్రాయ్ విజయన్ కన్నూర్ లోని ధర్మదామ్ నుండి ఆధిక్యతలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీఎం పదవి దక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ఈ సందర్బంగా అచ్యుతానందన్ మాట్లాడుతూ.. సీఎం పదవిని ఎవరు అధిష్టిస్తారు అనే విషయంపై పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది అని చెప్పారు.
కాగా కేరళలో మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకూ ఎల్డీఎఫ్ 95, పీడీఎఫ్ 42, బీజేపీ 01, ఇతరులు 2 స్థానాల్లో ఉన్నారు.