కేరళ ఓట్ల లెక్కింపు.. వెనుకంజలో శ్రీశాంత్..
posted on May 19, 2016 @ 10:36AM
మాజీ ఇండియా క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ తరుపున ఆయన కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి బరిలో దిగారు. కాగా ఈరోజు కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో శ్రీశాంత్ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న వీఎస్ శివకుమార్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, సీపీఎం ముఖ్యమంత్రి అభ్యర్థులు వూమెన్ చాందీ, వీఎస్ అచ్యుతానందన్ ముందంజలో కొనసాగుతున్నారు
మొత్తం 140 స్థానాల్లో 126 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. ఎల్‌డీఎఫ్ 66స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా యూడీఎఫ్ 51, భాజపా 3, ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.