అంగన్ వాడీ కేంద్రంలో 40 పాములు
posted on Mar 23, 2021 @ 10:07AM
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు, చీమలు పెట్టిన పుట్టలలోనే కాదు. మనిషి కట్టుకున్న ఇళ్లల్లోనూ, అప్పుడప్పుడు ఆఫీస్ లోనూ పాములు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ అంగన్‌వాడీ కేంద్రం లో పాములకు నిలయమైయింది.
మహాబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రతి రోజు లాగే చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు అంగన్ వాడి కేంద్రం తెరవడంతో కుప్పలు కుప్పలుగా పాములు కనిపంచాయని అంగన్‌వాడీ సిబ్బంది తెలిపారు. అంగన్ వామీ కేంద్రంలో ఏకంగా 40 పాము పిల్లలు, 2 తేళ్లు కనిపించడంతో అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
శిథిలావస్థలో ఉన్న భవనంలో అంగన్ వాడీ కేంద్రం నడపడం వల్లే ఇలా పాములు, తేళ్లు వస్తున్నాయని సిబ్బంది, స్థానికులు తెలిపారు. అయితే అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంగన్ వాడీ సిబ్బంది, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.