రాష్ట్ర విభజనపై సుప్రీంలో పిటిషన్లు
posted on Feb 4, 2014 @ 11:07AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో మూడు వ్యక్తిగత పిటిషన్లు. ఒకటి ప్రజాహిత వ్యాజ్యం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, విశాలాంధ్ర మహాసభ వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, ఢిల్లీకి చెందిన ఎం.ఎల్.శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. వీటిలో మూడు పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టనున్నామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శనివారం నాడు విచారణకు చేపట్టనున్నామని చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.