ఓల్డ్ బోయిన్ పల్లిలో భారీ చోరీ
posted on Oct 22, 2019 @ 1:18PM
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలోని మల్లిఖార్జున నగర్ లో భారీ చోరీ జరిగింది. వడ్డీ వ్యాపారం చేసుకుంటున్న సరళ దంపతులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటకి వెళ్ళారు. వేసిన తాళాలు వేసినట్టు ఉండగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు,నగదు మాయం అయ్యాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి దుండగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలు,వెండి,పధ్ధెనిమిది లక్షల నగదు దోచుకెళ్ళారు. ఇంట్లో ఉన్నది అంతా దోచుకు వెళ్ళటంతో సరళ దంపతులు తీవ్ర దిగ్బ్రాంతికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు స్వీకరించారు. దొంగతనం చేసింది ఇంట్లో వాళ్ళా లేక బయటి వారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటనా స్థలాన్ని బేగంపేట ఏసీపీ రామ్ రెడ్డి పరిశీలించారు. సోమవారం సాయంత్రం ఈ దొంగతనం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులకి ఇంటి యాజిమాన్యం సమాచారం అంధించటంతోటి హుటా హూటీగా పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకున్నారు. పోలీసులు దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల తరువాత దొంగతనం జరిగిందని తెలుసుకున్న పోలీసులు వివరాలను స్వేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఎక్కడా బ్రేక్ లు లేక పోవటం, తాళాలు పగలుగొట్టి లేకపోవటం ఇటువంటి వివరాలు అన్ని పరిశీలించిన తరువాత అసలు ఈ దొంగతనం ఇంటి దొంగల పనా లేక బయటి వాళ్ళు ఎవరైన వచ్చి చేశారన్నటువంటి కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎక్కడా కూడా తాళాలు పగలకొట్టినట్టు వంటి పరిస్థితి లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విషయం పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుల పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.