సముద్రంలోకి 19 వేల తాబేలు పిల్లలు!
posted on Apr 25, 2020 @ 12:33PM
సముద్రపు తాబేళ్లు డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకు తీరానికి వచ్చి ఇసుకలో గుంత తవ్వి గుడ్లు పెట్టి కప్పి వెళతాయి. ఒక తాబేలు 140 నుంచి 170 వరకు గుడ్లు పెడుతుంది. కుక్కలు, పక్షుల నుంచి గుడ్లను రక్షించే పనులను అటవీ శాఖ చేపట్టి, ఆ గుడ్లను సేకరించి కేంద్రంలో ఉంచి, అవి పొదిగిన అనంతరం పిల్లలను సముద్రంలోకి వదిలిపెడుతున్నారు.
బీసెంట్ నగర్, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఉన్న తాబేలు గుడ్ల పొదిగింపు కేంద్రాల నుంచి పొదిగిన 19 వేల తాబేలు పిల్లలను సముద్రంలో వదలిపెట్టారు.
బీసెంట్‌నగర్, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఏర్పాటుచేసిన గుడ్ల భద్రతా కేంద్రాల్లో 30 వేల గుడ్లను సేకరించగా, 19 వేల పిల్లలు బయటకు వచ్చాయి. వారిని గురువారం అటవీ శాఖ సిబ్బంది సముద్రంలో వదలిపెట్టారు. మిగిలిన గుడ్ల నుంచి వచ్చే పిల్లలను అంచెలంచెలుగా సముద్రంలోకి వదలిపెడతామని అధికారులు తెలిపారు. గత ఏడాది 50 వేల గుడ్లును సేకరించగా 40 వేల పిల్లలు బయటకు వచ్చాయని వారు తెలిపారు.