జమ్ము కాశ్మీర్ రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి
posted on May 20, 2014 @ 12:16PM
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించారు. బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించినవారందరూ యువకులే. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. జమ్మూకు 170 కిలోమీటర్ల దూరంలో గల రాంబన్ జిల్లాలోని డిగ్దోల్ వద్ద జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. తీవ్రంగా గాయపడినవారిని హెలికాప్టర్ ద్వారా జమ్మూ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన మిలటరీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు రాజౌరి జిల్లాలోని పూంఛ్ నుంచి కాశ్మీర్ లోయకు వెళ్తున్నారు. మరణించిన, గాయపడిన వారిలో గుజరాత్‌కు చెందినవారు కూడా కొంత మంది ఉన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ అధికారులకు సైనికాధికారులు సహకరిస్తున్నారు.