కొత్త హెయిర్ స్టైల్ కోసం .. కిరోసిన్ తో ఫైర్..
posted on Mar 25, 2021 @ 10:26AM
చినిగిన చొక్కా అయినా తోడుకు గానీ, మంచి పుస్తకం కొనుకో అన్నది పాత మాట. నువ్వు ఏపని అయినా చేయి గానీ స్టైల్ గా, ట్రెండ్ గా ఉండాలనేది ఇప్పుడు యువత నమ్మకం. అది అలా ఉంచితే వాడిది ఏం టెస్ట్ రా.. హెయిర్ స్టైల్ బలేఉందిరా.. వాడి డ్రెస్ స్టైల్ బలే ఉందిరా అని అనిపించుకోవాలని యువత ఎప్పుడు ఆలోచిస్తుంటారు. మరి యువత నమ్ముకున్న స్టైల్ మన అమ్మ నాన్నలకు అన్నం పెడుతుందా. పోనీ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తుందా.. కనీసం యువత నమ్ముకున్న స్టైల్ వారికైనా ఒక్క పూట కడుపు నింపుతుందా అంటే అది లేదు. అలా అని స్టైల్ గా ఉండొద్దని కాదండోయి. కానీ ఆ స్టైల్ మనకు ఎంత వరకు అవసరమే అంత వరకు మాత్రమే ఉండాలి. మితిమీరి స్టైల్ కొడితే అనర్ధాలకు దారి తీస్తుంది.
సినిమాల ప్రభావమో , సోషల్ మీడియా బలవంతంగా యువతపై రుద్దడమో, ట్రెండ్ ట్రెండ్ అంటూ యువత పడే మోజో తెలియదు గానీ, తమ అభిమాన హీరోను అనుకరించడం, సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ వైరల్ వీడియోలను ఫాలో కావడం.. ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలా ఫాలో అయ్యే క్రమంలో ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు యువత.. ఫాలో అవ్వడం వరకు ఓకే . కానీ వారి ప్రాణాల మీదికి కోరి తేల్చుకుంటున్నారు యువత.
తాజాగా యూబ్యూబ్‌లో చూసి ఓ బాలుడు తన హెయిర్ స్టైల్ పై ప్రయోగం చేశాడు. న్యూ లుక్ హెయిర్ స్టైల్ కోసం తలపై కిరోసిన్ పోసుకొని ఫైర్ చేసుకున్నాడు. తన న్యూ హెయిర్అ స్టైల్ తన ప్రాణం తీసింది. 12 ఏళ్ల శివనారాయణన్ ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇతడు సోషల్ మీడియా అనే అల్లారంతోనే తన డే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళకంటే సోషల్ మీడియా నే ఎక్కువగా ఫాలో అవుతాడు. లేటెస్ట్ ట్రెండ్స్‌కు తగ్గట్టు స్టైల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో శివనారయణన్ ఇటీవల యూట్యూబ్‌లో ఓ సరికొత్త హెయిర్ స్టైల్ వీడియో చూశాడు. అందులో తలపై మంటపెట్టి హెయిర్ స్ట్రెయిట్‌నింగ్ చేశారు. ఆ వీడియో అతడికి తెగ నచ్చింది. వెంటనే తాను అలాగే చేయాలనుకున్నాడు. బాత్రూమ్‌కు వెళ్లి.. తలపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకున్నాడు. ప్రయోగం బెడిసికొట్టి తలపై పెద్ద మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలతో విలవిల్లాడిపోయాడు.
ఆ సమయంలో ఇంట్లో అతడి నానమ్మ మాత్రమే ఉంది. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల ప్రజలు వచ్చి మంటలను ఆర్పివేశారు. తీవ్ర గాయాల పాలైన శివనారాయణన్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. శివనారాయణన్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరూ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.ఈ ఘటన కేరళ తిరువనంతపురంలోని వెంగనూర్ లో జరిగింది.