జగన్ పార్టీలో బయటపడుతున్న దొంగలు
posted on Aug 2, 2013 @ 7:12PM
ఇప్పటికే వరుసగా ముగ్గురు మోసగాళ్లు ఇటవలే వైసీపీలో బయటపడిన సంగతి తెలిసిందే తాజాగా గుంటూరులో మరో ఆణిముత్యం బయటకు వచ్చింది. మేడికొండూరుకు చెందిన ధనేకుల కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్లో క్రియాశీలక నేత. జిల్లాలో షర్మిల పాదయాత్ర జరిగినపుడు అక్కడ కట్టిన బ్యానర్లలో అధిక శాతం కళ్యాణివే. నిరంతరం నాయకులతో కలిసి తిరిగేది.
ఇదిలా ఉండగా….నాలుగు రోఉల క్రితం గుంటూరు బ్రాడీపేటలోని ఓ జువెలరీ దుకాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత పేరుతో ఫోన్ చేసింది. మా వాళ్లను పంపుతున్నాను. కొన్ని డిజైన్లు పంపితే నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. తర్వాత కొంతసేపటి తర్వాత ఓ వ్యక్తి ఆ దుకాణానికి వెళ్లాడు. తనను ఎమ్మెల్యే పంపారని, ఇరవై లక్షల విలువైన నగలు తీసుకెళ్లారు. ఎంత బాగా నమ్మించారంటే రెండ్రోజుల తర్వాత ఆరు లక్షల నగలు తిరిగి ఇచ్చేశారు. తీసుకున్న వాటికి డబ్బలు ఆన్లైన్లో పంపుతామని చెప్పారు. తీరా ఎన్నాళ్లకీ డబ్బు రాకపోయేటప్పటికి పోలీసుల వద్దకు వ్యవహారం వెళ్లింది. అపుడు ఆ వ్యక్తిని విచారిస్తే కళ్యాణి పేరు బయటకు వచ్చింది. ఆమెను విచారిస్తే నగలు బయటకు వచ్చాయి.
ఈ మేడమ్ గారి చరిత్ర ఏంటో తెలుసా… హైదరాబాదులో చదువుకుంది. ఇక్కడే ఒక వ్యక్తిని పెళ్లాడింది. రెండు నెలలకే అతనితో విడిపోయింది. ఆ తర్వాత వైసీపీ అయితే తనకు అడ్డంకి ఉండదని అనుకుని తన గ్లామర్ తో అక్కడ సెటిలైంది.