కాంగ్రెస్‌లో కలిసేందుకే విజయమ్మ పర్యటన?
posted on Jul 6, 2012 @ 9:30AM
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వై.కా.పా.నేతల ఢల్లీ పర్యటన దీన్ని బలపరుస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. జగన్ కోసం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, రైతుల పేరిట వ్యవసాయశాఖా మంత్రి శరద్‌పవార్‌ను వై.కా.పా. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. అయితే వీరిద్దరి దగ్గర విజయమ్మ పెద్దగా మాట్లాడిరదేమీ లేదని తెలుస్తోంది. ముందస్తు పరిచయాలు ఆ తరువాత ఉపోద్ఘాతం వినిపించి వచ్చేసరికి ఆలస్యమైందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పైపెచ్చు విజయమ్మ ఒక్కరే వీరిద్దరితో మాట్లాడటం వల్ల జగన్ విడుదల గురించే శ్రద్ధ చూపారని తెలుస్తోంది.
అయితే రాజశేఖరరెడ్డి కుమారుడైనందున కక్ష సాధిస్తున్నారన్న కొత్తవాదనను ఆమె ఢల్లీి పెద్దల ముందుంచారు. అసలు కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదని ఆ ఇద్దరూ అన్నారని తెలిసింది. ఇప్పటికైనా కేసుల నుంచి తన కుమారుడిని రక్షించాలని విజయమ్మ కోరారు. దీనికి ఇద్దరూ మౌనంన వహించారని తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని కూడా విజయమ్మ ఎర వేశారని తెలిసింది. దీనికీ అంతగా స్పందించలేదని సమాచారం. విజయమ్మ ఢల్లీ వచ్చిన వెంటనే తాను రైతుల సమస్యలపై వచ్చానని అన్నందున దానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని, వ్యవసాయశాఖామంత్రి ఇద్దరూ భావించినట్లు తెలిసింది. ఏది ఏమైనా విజయమ్మ తన బాధను కాంగ్రెస్ పెద్దలకు పంచారు. ఇక వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ బయటికి వచ్చాక కాంగ్రెస్‌లో పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తేనే కాంగ్రెస్ కలగజేసుకుంటుందని రాష్ట్రనేతలు అంటున్నారు. అప్పుడైనా అవినీతిపరుడిని అక్కున చేర్చుకున్న అపకీర్తి తప్పదు కదా అని ఆలోచనలో పడ్డారట. అయితే విజయ్మ అండ్ కో ఢల్లీి వెళ్లింది కాంగ్రెస్‌లో చేరటానికేనని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాదరావు ఆరోపించారు.