జగన్ సినిమా అట్టర్ ఫ్లాప్
posted on Apr 22, 2013 @ 5:33PM
ప్రజాప్రస్థానం పేరిట వైసీపీ నేత షర్మిల చేపట్టిన పాదయాత్రపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ఫెయిల్యూర్ స్టోరీ అని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ అన్నారు. కడప సీటు ఇవ్వలేదని అలకయాత్ర చేస్తున్నారని విమర్శించారు. పీఆర్‌పీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని, జగన్ సినిమా రిలీజ్ కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పెట్టాల్సింది ఎన్టీఆర్, మహేష్‌బాబూ ఫోటోలు కాదని దుర్యోదనుడు, దుశ్శాషనుడు, రావణాసురుడు, సూర్పనఖ ఫోటోలు పెట్టుకోవాలని రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర పరుగు పందెంగా మారిందని మరోనేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. పాదయాత్రలో షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. స్థాయి మరిచి చంద్రబాబును విమర్శించినందుకే కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర తిరస్కరణకు గురైందన్నారు. పులిచింతల, బందరు పోర్టు నిర్మాణంలో భారీగా ముడుపులు తీసుకున్నారన్నారు. రక్షణ స్టీల్స్ షర్మిల బినామీ సంస్థ అని దేవినేని ఉమా ఆరోపించారు.