వైకాపా ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి అరెస్ట్
posted on Mar 21, 2014 @ 3:30PM
రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపర్చేందుకు బెంగుళూరు నుంచి బళ్లారికి తరలిస్తున్న జగన్, కాపు ఫోటోలున్న గోడగడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.36 లక్షల విలువ చేసే చెక్కులు, చీరలు, రైస్‌కుక్కర్లు, క్రికెట్ సామాగ్రిని పోలీసులు బళ్లారి చెక్ పోస్ట్ వద్ద సీజ్ చేశారు. ఈ ఉదయం కర్నాటక బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు ఏకకాలంలో సోదాలు చేసి ఓట్లర్లకు పంచేందుకు సిద్దం చేసిన సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రామచంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు.