వెంకయ్య, మాయావతి.. ఢీ అంటే ఢీ
posted on Jul 18, 2016 @ 6:01PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా.. వెంకయ్య నాయుడికి, బిఎస్పీ అధినేత్రి మాయావతి కి మధ్య తీవ్ర వాగ్యాదం జరిగింది. గుజరాత్ లో దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాయావతి మాట్లాడుతూ.. దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని.. దీనికి కేంద్రానిదే బాధ్యత అని మండిపడ్డారు. గుజరాత్‌లోని యునా పట్టణంలో గో రక్షక దళం కార్యకర్తలు దళిత యువకులను బహిరంగంగా కొట్టి పేడ తినిపించారనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దేశంలో దళితులపై దాడులు పెరిగాయని మాయావతి ఆరోపించారు.
దీనికి వెంకయ్య నాయుడు స్పందించి మాయవతి వ్యాఖ్యల్ని ఖండించారు. పార్టీ పేరు ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా అంశం గురించి మాట్లాడేప్పుడు దానిలో ఉన్న అంశాన్ని గురించి మాట్లాడాలి కానీ... పార్టీ పేర్లను ప్రస్తావించడం సబబు కాదని అన్నారు. మరి సమావేశాలు ప్రారంభమైన ఇప్పుడే ఇంతలా ఉంటే ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.