బాబ్లీ లో టీఆర్ఎస్ పాత్ర కూడా ఉంది
posted on Mar 2, 2013 @ 3:30PM
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టులో టీఆర్ఎస్‌కూ పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు తుమ్మనాగేశ్వర్‌రావు, ఎర్రబల్లి దయాకర్‌రావు, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఏం గడ్డిపీకడానికి బాబ్లీపై సుప్రీంలో పిటిషన్ వేశారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎందుకు, ఎవరి కోసం వాదించారని దుయ్యబట్టారు.
మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా వివిధ పార్టీల నేతులు బాబ్లీ వల్ల నష్టం లేదనడం అవగాహణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గోదావరి నదిపై చెక్‌డ్యాం పేరుతో మహారాష్ట్ర అక్రమంగా 13 అక్రమ జలాశయాలు నిర్మించిందని వారు ఆరోపించారు.
రెండు టీఎంసీల తాగు నీటి కోసం డ్యాం కట్టుకుంటున్నామని చెబుతూ బాబ్లీ ప్రాజెక్టు పేరుట వందల టీఎంసీల నీటిని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబ్లీనీ కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని డిమాండ్ చేశారు.