మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్...నలుగురు ఉగ్రవాదులు హతం
posted on Oct 7, 2016 @ 10:14AM
భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించింది. పలుచోట్ల కాల్పులకు పాల్పడ్డారు. పూంచ్ సెక్టార్ సమీపంలోని మాల్తీలో మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. సైనిక శిబిరాలు, జనావాసాలే లక్ష్యంగా దాడులకు దిగగా భారత సైన్యం రంగంలోకి దిగి దాడులకు దీటుగా కాల్పులు జరిపి తిప్పికొట్టింది. మరోవైపు పాక్ ప్రయోగిస్తున్న మోర్టార్ షెల్స్ జనావాసాల్లో పడుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
ఇదిలా ఉండగా.. కుప్వారా జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై దాడి చేయగా భారత సైన్యం వారిని ఎదుర్కొంది. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఉదయం 5.00 గంటల సమయంలో లాంగేట్ సమీపంలోని ఆర్మీ క్యాంప్‌పైకి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారికి తగినరీతిలో జవాబు చెప్పారని అన్నారు.