హత్య కేసులో లాలు కొడుక్కి కోర్టు నోటీసులు..
posted on Sep 23, 2016 @ 12:51PM
ఆర్జీడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు.. రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తేజ్ ప్రతాప్ తో పాటు ఇటీవలే 12 ఏళ్లు జైలులో ఉండి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు కూడా నోటీసులు పంపింది. బిహార్‌లో జర్నలిస్ట్ రాజ్ దేవ్ రంజన్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్‌తో తేజ్‌ప్రతాప్, షాబుద్దీన్ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీంతో బిహార్ పోలీసులపై తమకు విశ్వాసం లేదని, కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలని రంజన్ భార్య ఆశా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారించిన న్యాయస్థానం వీరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసును దర్యాప్తు చేపట్టి.. అక్టోబర్ 17లోగా నివేదికను అందించాలని సీబీఐని ఆదేశించింది.