టిడిపి 33వ ఆవిర్భావదినోత్సవం
posted on Mar 29, 2014 @ 12:34PM
1982లో ఆవిర్భవించిన టీడీపీ పార్టీ తన ప్రస్థానంలో 32వ మైలురాయిని దాటింది. మరోసారి తెలుగువాడి సత్తా చాటేలా 33వ ఏటా అడుగుపెట్టింది. టీడీపీ 33వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను బాబు గుర్తుచేసుకున్నారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ పవిత్ర ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, మూడు దశాబ్దాలుగా పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, కార్యకర్తల త్యాగాలు, నిస్వార్ధ సేవలు, చంద్రబాబు సారథ్యంతో ఎదిగిన పార్టీ పయనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని టిడిపి పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
VIDEO COURTSEY TV9