కారులో కాలేజ్ స్టూడెంట్ గ్యాంగ్ రేప్
posted on Nov 3, 2012 @ 3:38PM
రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ కాలేజ్ విద్యార్దినిని తోటి విద్యార్ధులు అమానుషంగా రేప్ చేశారు. కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ చెరిచారు. కళ్లకి గంతలుకట్టి ఎక్కడికో తెలియని చోటుకి తీసుకెళ్లి ఒకరితర్వాత ఒకరుగా అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్ లో దాన్ని చిత్రీకరించారు. ఈ సంగతి ఎక్కడైనా చెబితే మానభంగం దృశ్యాల్ని ఇంటర్ నెట్ లో పెట్టేస్తామని బెదిరించారుకూడా. కానీ.. తోటి విద్యార్ధిని నమ్మి దారుణంగా మోసపోయిన బాధితురాలుమాత్రం నేరుగా పోలీస్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేసింది.
మార్క్స్ లిస్ట్ ని పోగొట్టుకున్న బాధితురాలు దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలా అని ఆరా తీస్తున్నప్పుడు నిందితులు కనిపెట్టారు. తాను చెప్పిన చోటికివస్తే డూప్లికేట్ మార్క్ లిస్ట్ ని ఇప్పించే వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పిన నిందితులు బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని దురాగతానికి పాల్పడ్డారు. బాధితురాలు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. ప్రత్యేక బృందాలు వాళ్లకోసం గాలిస్తున్నాయ్.