వెంట్రుక వాసిలో తప్పించుకున్న జపాన్ ప్రధాని
posted on Apr 15, 2023 @ 1:49PM
జపాన్ ప్రధానమంత్రి పుమియా కిషిదా మీద స్మోక్ బాంబ్ దాడి జరిగింది. ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసులు అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ టైమ్స్ కథనం ప్రకారం వాకయామా నగరంలో ప్రధానమంత్రి పుమియో కిషిదా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న సమయంలో స్మోక్ బాంబు పేలింది. స్మోక్ బాంబును దూరం నుంచి ఓ వ్యక్తి విసిరేసాడు. దీంతో అక్కడ పొగలు కమ్ముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు కనబడుతుంది. ప్రధానమంత్రి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. అధికారంలో వున్న లెబరల్ డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి తరపున ప్రధాని ప్రచారం చేయడానికి వచ్చారు.
జపాన్ ప్రధానమంత్రి మీద దాడి జరగడం పలువురిని విస్మరించింది. భధ్రతా బలగాలు కూడా ఊహించని విధంగా ఈ దాడి జరిగింది. కొద్ది రోజుల్లో జపాన్ దేశంలో జీ 7 సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం జపాన్ ప్రధానికి సవాల్ విసిరినట్టయ్యింది.