షాపింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

 

షాపింగ్‌పై నియంత్రణ కోల్పోయి అవసరం లేని వస్తువులు కూడా కొనేసి, ఇంటికి వచ్చాక లెక్కలు కట్టి బాధపడేవారు చాలామందే ఉంటారు. ఇలా అవసరాన్ని మించి హ్యాండ్ బ్యాగ్‌లో లేదా ATM లో ఉన్న డబ్బంతా ఖర్చుచేస్తే ఆ నెలంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

* ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్, ముందుచూపు చాలా అవసరం. అందుకే షాపింగ్‌కు వెళ్ళేముందు కావాల్సినంత డబ్బు మాత్రమే తీసుకువెళ్ళండి. ATM కార్డులో పుష్కలంగా బ్యాలెన్సు ఉంది కదా అని ఎడా, పెడా ఉపయోగించకండి. ఈ కార్డులు హ్యాండ్ బ్యాగులో ఉంటే అవసరానికి మించి కొనడానికి ఉత్సాహపడతారు. కాబట్టి వీలయినంతవరకూ వాటిని బైటకు తీయవద్దు.

* షాపింగ్‌కు వెళ్ళే ముందే ఇంటి దగ్గర ఒక చిన్న స్లిప్‌మీద ఏమేమి కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత డబ్బు వాటికి అవసరం అవుతుంది అని చిన్న జాబితా తయారుచేసుకోండి. జాబితా తయారుచేసుకున్నాకా మీ వద్ద ఉన్న డబ్బుకు మించి జాబితా తయారైతే అవసరం లేని వస్తువులేమైనా ఉన్నాయో చూసుకుని వాటిని తొలగించండి. ఇంకా వీలైతే అత్యవసరం ఉన్న వాటినే లెక్కలో ఉంచుకోవాలి. షాపింగ్ కు వెళ్ళాక తయారుచేసుకున్న జాబితాలో నుంచే కొనుగోళ్ళు ప్రారంభించాలి.

*  వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. చాలామంది కూడా ప్రకటనలపైనా, ఫ్రీ గిఫ్ట్‌లపైనా దృష్టి పెడుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కొనుగోళ్ళు చేస్తే తగిన నియంత్రణలో ఉన్నట్లు లెక్క.

* కొంతమంది బోర్‌గా ఉందని, ఏం తోచక షాపింగులు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. బోర్ కొట్టేవాళ్ళు కాలక్షేపానికి మరేదైనా పనిమీద మనసు లగ్నం చేస్తే బాగుంటుంది. అంతేకాని షాపింగు చేయడాన్ని ఎంచుకోవద్దు.

* నెలంతా అవసరమయ్యే అన్ని ఖర్చులు రాసుకుని ఆ తర్వాతే షాపింగు ఖర్చు తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే వచ్చిన డబ్బంతా షాపింగ్‌కు ఖర్చుపెట్టి ఆ తర్వాత అప్పులు చేయవద్దు.

* హైక్లాస్ అయినా మిడిల్, లోయర్ క్లాసుల వాళ్ళయినా షాపింగ్‌లో నియంత్రణ కలిగి ఉండటం చాలా మంచిది.