సమైక్యాంధ్రపై తీర్మానం పెట్టాలి: శోభా నాగిరెడ్డి
posted on Sep 26, 2013 @ 3:24PM
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం నెగ్గేందుకే వైఎస్సార్ సీపీ రాజీనామాల ఆమోదం కోసం పట్టుబడుతోందన్న విమర్శలు తీవ్రమవడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించి రాజీనామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మూడు డిమాండ్లు చేశారు. విభజన నిర్ణయం నేపథ్యంలో అసెంబ్లీని వెంటనే సమావేశ పర్చాలి, సమైక్యాంధ్రపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, పాస్ చేయించిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపించి ఆ తర్వాత రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు.
తాము దీనిపై గురువారం సాయంత్రం స్పీకర్‌ను కలుస్తామని, అపాయింట్మెంట్ దొరికితే గవర్నర్‌ను కూడా కలుస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర పైన తమ పార్టీని ప్రశ్నించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని శోభా నాగి రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశామని, అలాంటప్పుడు తమను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదన్నారు.