నాకేలా ఇన్ని కష్టాలు...!

 

 

 

వై.ఎస్. విజయమ్మ తన బిడ్డ షర్మిలను కలుసుకొని మాట్లాడుతున్న సందర్భంలో బోరున విలపించారు. 'ప్రభువా! నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావ్ ...' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ పాదయాత్రికురాలు షర్మిల తన అన్నాను కలిసేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన సంఘటన ఇది. మొదటినుంచి వైఎస్ కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం ప్రారంభించాలన్న దైవ ప్రార్దనతోనే మొదలయ్యే సంప్రదాయం నెలకొని ఉంది. గత రెండు దశాబ్దాలుగా పులివెందుల చర్చి పాస్టర్ సాల్మన్ ప్రభుతులు వైఎస్ కుటుబం చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా ప్రార్థనతో మొదలుపెట్టి 20 నిముషాల పాటు ప్రభువుకు నివేదిస్తారు. ఆ తరువాత వారికి ప్రభువును వచ్చే సంకేతాలను బట్టి ఆయా కార్యక్రమాలను కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకొనే ఆనవాయితీ నెలకొని ఉంది.


 ఆ ప్రకారమే యథావిధిగా షర్మిల తన అన్నను కలిసేందుకు జైలుకు వెళ్ళే ముందు యథావిధిగా పులివెందుల సీఎస్ ఐ చర్చి ఫాస్టర్ ప్రార్థన నిర్వహించారట. ఆ ప్రార్థనలో షర్మిల జైలుకు వెళ్ళే విషయమై ప్రభువునుంచి అనుకూల సంకేతాలు రాకపోవడంతో విజయమ్మ షర్మిలను ఆపే ప్రయత్నం చేశారట. కానీ అప్పటికే షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రకారం జగన్ ను కలిసేందుకే మొగ్గుచూపడంతో తీవ్ర నిరాశకు గురైన విజయమ్మ బోరున విలపిస్తూ నా కుటుంబానికే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు ప్రభువా అని కన్నీటిపర్యంతం అయ్యారట.



 అక్కడే ఉన్న ఫాస్టర్లతొ ఆమె తన దుఃఖాన్ని పంచుకుంటూ గతంలో తన భర్త కూడా ప్రభువు నిర్ణయానికి వ్యతిరేకంగా హెలికాఫ్టర్ ప్రయాణం చేయడంతో అకస్మాత్తుగా మరణానికి గురయ్యారనే విషయాన్ని గుర్తుకు తెస్తూ మళ్ళీ ప్రభువు నిర్ణయానికి వ్యతిరేకంగా షర్మిల ఈ రోజు జైలుకు వెళ్ళడం ఉదంతాన్ని ఆమె ఆ ఫాస్టర్లతొ మొరపెట్టుకున్నారట. నా కొడుకు, భర్త మరణం తరువాత పట్టుమని పదిరోజులు కూడా మాతో గడపలేదు. ఓదార్పు యాత్రలంటూ ఎప్పుడు ప్రజల్లోనే తిరిగేవాడు. మధ్యలో అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళాడు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో ఉండలేకపోతున్నారు. కూతురు కూడా పాదయాత్ర చేపట్టి కాలికి దెబ్బ తగిలించుకుంది. ఇప్పుడేమో కోడలిని పాదయాత్రను కొనసాగించమంటున్నారు. అసలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని ఆమె బోరున విలపించారట.