ఆంధ్ర రాజధాని నిర్మాణానికి కమిటీ
posted on Jul 20, 2014 @ 6:22PM
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కొత్త రాజధాని రూపురేఖలు నిర్ణయించడానికి సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు, పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి (జీవీకే), బొమ్మిడాల శ్రీనివాస్ (జీఎంఆర్), ఎం. ప్రభాకర్ రావు (నూజివీడు సీడ్స్), పీపుల్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి శ్రీనివాసరాజులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు రాజధానిలో రాజ్ భవన్, సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలపై పరిశీలిస్తుంది. రాజధాని రూపు రేఖలు ఏ విధంగా ఉండాలి... రవాణా వ్యవస్థ, రోడ్ల నిర్మాణం ఎలా ఉండాలి.. మౌలిక సదుపాల ఏర్పాటు... తదితర అన్ని ఏ విధంగా ఉండాలి అనే ఒక సలహా ఇవ్వడానికి ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. 10 రోజులలో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.