కేసీఆర్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు
posted on Dec 7, 2013 @ 4:35PM
వివాదాలు అంటే ముందుండె సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాష్ట్ర విభజన పై, కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు.
కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు.