రావణుడ్ని కాల్చవద్దంటూ...రోడ్డెక్కిన బ్రాహ్మణులు!
posted on Oct 5, 2025 @ 3:26PM
దేవుడా ఈ సమాజాన్నినువ్వే కాపాడాలి? అయినా ఎటు పోతోందీ సమాజం? ఏంటీ వైపరీత్యం.. నువ్వే మాకు రక్ష అంటూ ప్రార్ధించాల్సి వస్తోంది చూస్తోంటే.. తాజాగా కొందరు బ్రాహ్మణులు.. ఒక కొత్త వాదన తెరపైకి తెచ్చారు.. అదేంటంటే రావణుడు బ్రాహ్మణుడు ఆయన్ను దసరా సందర్భంగా కాల్చవద్దంటూ డిమాండ్ చేశారు.
ఇప్పటికే దళితులు రావణుడు, నరకాసరుడు మా వాళ్లు. వాళ్లను అవమానించవద్దన్ని వీరి వాదనగా ఉంటూ వచ్చింది ఇన్నాళ్లు. ఇప్పుడీ వాదన కాస్తా బ్రాహ్మణులు అందుకున్నారు.
దీంతో రావణుడు ఎవరన్న చర్చకు మళ్లీ తెరపైకి వచ్చింది. బేసిగ్గానే రావణుడ్ని పిలవడమే రావణ బ్రహ్మ అంటారు. అలాంటి రావణ బ్రహ్మ బ్రాహ్మణుడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి పురాణాలు తిరగవేయక్కర్లేదు.
ఇక నరకాసరుడు కూడా రాక్షసుడేం కాదు.. మహా విష్ణువు వరాహ అవతారంలో భూమిని కాపాడినపుడు జరిగిన సంయోగం ద్వారా పుట్టిన వాడు. అతడి పుట్టుకకు బీజం వేసిన వేళా విశేషం.. రాక్షస లక్షణాలు అలవడ్డాయి. దీంతో.. అతడు జనపీడితుడయ్యాడు. ఈ విషయం గుర్తించిన భూదేవి మహా విష్ణువును ఒక వరం అడిగింది. తనే స్వయంగా తన పుత్రుడ్ని కడతేర్చుతానని కోరారామె. అందులో భాగంగానే ద్వాపర యుగంలో సత్యభామగా నరకాసుర వధ చేశారు. అదే మనకు దీపావళి అయ్యింది.
ఈ ఇరువురు రాక్షసులకు దళితులకు సంబంధమే లేదు. బ్రహ్మ రాక్షసుడు అన్న పదంలో శూచించే బ్రహ్మ శబ్ధం కూడా ఇదే. పాండిత్య శోధనలో.. ఒక్కోసారి తప్పులు దొర్లి వారికంటూ ఆ జన్మ శాపంగా లభిస్తుంది. దీంతో వారు బ్రహ్మ రాక్షసులై జనకంటకులవుతారు.
అయితే ఇక్కడ రావణాసురుడి విషయంలో బ్రాహ్మణులు తెలుసుకోవల్సినదేంటంటే అసలు దేవతల్లో కూడా బ్రాహ్మణులు ఎవరూ ఉండరు. శివుడు ఏకంగా జంగమయ్య, స్మశాన వాసి. ఆపై దశావతారాల్లో పరుశురామ, వామన అవతారాలు తప్ప మిగిలినవన్నీ బ్రాహ్మణేతర అవతారాలే. బ్రాహ్మణ అవతారాలైన పరుశురామ, వరాహ మూర్తులకు అసలు పూజలు, అర్చనలే పెద్దగా ఉండవు.
బ్రాహ్మణుల వైదీకమంతా నడిచేది క్షత్రియ రామ, యాదవ కృష్ణ, ఆపై అర్ధనరులైన నరసింహ వంటి అవతారాలకే. ఇందులోని అర్ధమేంటంటే.. సత్యభామలా మనమూ వ్యవహరించక తప్పదని. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే సమన్యాయం పాటించాలి.
కులమత వర్గ వైషమ్యాలకు, రాగ ద్వేషాలకు తావు లేదన్న ధర్మం పాటించడంలో భాగంగా.. బ్రాహ్మణుడైనా.. రావణుడు తప్పే అన్నది ఎప్పటి నుంచో ఈ బ్రాహ్మణీకం ఆచరిస్తూ వచ్చిన ఆచారం. ఆపై నరకాసురుడి విషయంలోనూ ఇదే నియమం. వారు ఆది నుంచీ పాటిస్తూ వస్తున్నారు. ధర్మ నిబద్ధులు, బ్రహ్మ జ్ఞానులైతే తప్పక ఆదరించాలన్న ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే రామకృష్ణనారసింహ వంటి బ్రాహ్మణేతర దేవుళ్ల ఆరాధన. కాబట్టి ఈ విషయం తెలుసుకోకుండా ఇలా రోడ్లు ఎక్కడం సరికాదంటారు చాగంటి, గరికపాటి వంటి పండితోత్తములు!