రాజ్యసభ ఎన్నికలు...దగ్గుబాటి తిరస్కరణ ఓటు
posted on Feb 7, 2014 @ 11:43AM
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదట శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తమ ఓటును వేశారు. టిడిపి పార్టీ తమ ఇద్దరూ అభ్యర్ధులకు 37 ఓట్లు కేటాయించింది. లోక్ సత్తా అధినేత జేపీ కూడా తన ఓటును టిడిపికి వేయనున్నట్లు ప్రకటించారు. వైకాపా,బిజెపిలు ఓటింగ్ కు దూరంగా వున్నాయి.
మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొలిసారిగా తిరస్కరణ ఓటు వినియోగించుకున్నారు. ఆయన ఏ అభ్యర్ధికి ఓటు వేయలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పే తిరస్కరణ ఓటు వేసినట్లు తెలిపారు. విభజన బిల్లు సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసేలా లేదని విమర్శించారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని, అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు తెలిపారు.