శ్రీవారిని దర్శించుకున్న రాజపక్సే

 

 

 

 

శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. మహిందా రాజపక్సే శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు 97 మంది ప్రతినిధులతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయనికి టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికారు.


శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాజపక్సే మీడియాతో మాట్లాడారు. తన పర్యటన సంధర్బంగా వెల్లువెత్తిన్న నిరసనలపై స్పందిస్తూ.. ఇండియా ప్రజాసామ్య దేశమని, ఇక్కడ ఎవరైనా నిరసన తెలియజేసే హక్కు వారికి ఉంటుందని అన్నారు.