రాహుల్ గాంధీ ఏం చేస్తాడో..!
posted on Jul 19, 2016 @ 4:42PM
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహాత్మగాంధీ హత్యకు ఆరెస్సెస్ వారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంపై రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. ఆరెస్సెస్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆ సంస్థ సభ్యులు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఓ సంస్థపై ఇలాంటి నింధలు ఎలా వేస్తారాని.. ఒక సంస్థపై ఆరోపణలు చేస్తే.. సంస్థలో ఉన్న వాళ్లందరిని తప్పుబట్టినట్టు అవుతుందని.. అలా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని.. జులై 27లోగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు రాహుల్‌ను ఆదేశించింది.
అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటిస్తాడా లేక లైట్ అని వదిలేస్తాడా అన్నది అందరి ప్రశ్న.. సుప్రీంకోర్టు ఆదేశించినట్టు క్షమాపణ చెబుతారా.. లేక కేసును ఎదుర్కొంటారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు వివాదాల్లో రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటికి తోడు ఇదొక రచ్చ. మరి దీనినైనా గోరుతో పోనిస్తారో.. లేక కొండంత చేస్తారో చూడాలి.