కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న అరుణ్ జైట్లీ
posted on Feb 29, 2016 9:09AM
ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 11 గంటలకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతులతో కేంద్రమంత్రి పార్లమెంట్ చేరుకున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌ని రూపొందించడంలో రెవెన్యూ కార్యదర్శి డాక్టర్ హస్‌ముఖ్ అదియా, ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ పి వటల్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్, పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి నీరజ్ కుమార్ గుప్తా, ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, బడ్జెట్ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ గోయల్, ముఖ్య సలహాదారు (కాస్ట్) అరుణా సేథిలు ముఖ్యపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.