పాలేరు ఉపఎన్నిక పోలింగ్ నేడే.. పక్కా ప్రణాళికతో టీఆర్ఎస్
posted on May 16, 2016 @ 10:03AM
ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక ఖరారైన సంగతి తెలిసిందే. అయితే రాంరెడ్డి మరణించడంతో ఆ స్థానం.. ఆయన సతీమణి సుచరితా రెడ్డికి ఏకగ్రీవ ఒప్పందంతో ఇవ్వాలని చూసినా దానికి టీఆర్ఎస్ ఒప్పుకోకపోవడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ ఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుండి సుచరితా రెడ్డినే బరిలోకి దింపారు. కాగా ఇప్పటి వరకూ జరిగిన మూడు ఉపఎన్నికల పోలింగ్ లో మూడింటిని టీఆర్ఎస్సే దక్కించుకోగా.. ఇప్పుడు నాలుగోసారి కూడా విజయం తమదే కావాలని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి అంతేకాక సర్వేలు కూడా టీఆర్ఎస్ దే విజయమని తేల్చిచెప్పేశాయి. మరి ఏం జరుగుతుందో.. విజయం ఎవరిదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.