పాక్ ఐఎస్‌ఐ చీఫ్ మార్పు.. ?
posted on Oct 8, 2016 @ 5:49PM
పాక్ గూఢచార సంస్థల్లో ఒకటైన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ) లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్‌ను ఆ పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దవాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చేయదలచుకున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాద అంశంలో అంతర్జాతీయంగా వివాదాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో అఖ్తర్‌ను ఆ పదవి నుంచి మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా లెఫ్టినెంట్ జనరల్ అఖ్తర్ ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా 2014 సెప్టెంబర్‌లో నియమితులయ్యారు. జనరల్ జహీర్ ఉల్ ఇస్లామ్ స్థానంలో అఖ్తర్‌ను నియమించారు. మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది వరకూ ఉన్నా అప్పుడే అతనిని మార్చే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మరిన్ని కీలక మార్పులు చేసేందుకు పాక్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.