హరగోపాల్ పై కేసు ఎత్తి వేత దిద్దు బాటే
posted on Jun 17, 2023 @ 12:46PM
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హర గోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురు మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బాల గోపాల్ పై కేసులు పెట్టడం పట్ల అభ్యుదయ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కెసీఆర్ నక్సలైట్లను వెనకేసుకొచ్చి ప్రస్తుతం పౌరహక్కుల నేతల మీద కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. హరగోపాల్ మీద కేసులు బనాయించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలంగాణ ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ రావడాన్ని కేసీఆర్ సరి చేసుకోవాలని ప్రయత్నించారు. అందులో భాగంగా హరగోపాల్ పై కేసు ఎత్తి వేయడానికి కారణమైంది.