బార్లలో డాన్సులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
posted on Jul 16, 2013 @ 3:39PM
ముంబై బార్లలో డాన్సులను అనుమతినిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. బోంబే పోలీస్ చట్టం 2005 ప్రకారం బార్ లలో నృత్యాలు చెయ్యటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చట్టం ఆహారపానీయాలు సేవించే చోట, పర్మిట్ రూం లేదా బార్ లేక బీర్ రూంలలో డ్యాన్స్ లు చెయ్యటాన్ని నిషేధించింది కానీ త్రీస్టార్ అంతకంటే పై స్థాయి హోటళ్ళు, కొన్ని పెద్ద సంస్థలలో అందుకు మినహాయింపు ఇచ్చింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మత్తు పదార్థాల సేవించే చోటు నృత్యాలు తగవని, అనైతికమని, అశ్లీలమని, వ్యభిచారానికి దారితీసే అవకాశముందని, మహిళలపట్ల దురాచారమని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
కానీ చట్టం ఎక్కడైనా ఒక్కటే కాబట్టి కొన్ని చోట్ల అనుమతులు మరికొన్ని చోట్ల నిషేధాలుండటం సరికాదని 2006 లో డ్యాన్సర్లు బార్ యజమానులు ఎపెక్స్ కోర్టు ని ఆశ్రయించగా కోర్టు వారి వాదనతో ఏకీభవించింది. ఈ లోపు బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం డాన్సర్లకు వారి వృత్తిని వారు చేసుకునే హక్కుని కాలరాస్తోందని అభిప్రాయపడింది. దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది.