మహారాష్ట్రలో మత ఘర్షణలు, నలుగురి మృతి
posted on Jan 7, 2013 @ 3:36PM
మహారాష్ట్రలోని ధూలే లో జరిగిన మత ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. ఆ పట్టణం మత ఘర్షణలతో అట్టుడుకి పోతోంది. ఓ హోటల్ లో మొదలైన చిన్నపాటి ఘర్షణ కొద్దిసేపటికి తీవ్ర స్థాయిలో మత ఘర్షణలకుదారి తీసింది. ఓ హోటల్ లో ఓ యువకుడు బిల్లు కట్టడానికి నిరాకరించిన విషయంతో ప్రారంభం అయిన ఈ ఘర్షణలను అదుపులోకి తేవడానికి పోలీసులు తీవ్రంగా కష్ట పడాల్సి వస్తోంది.
ఇరు వర్గాల దాడుల్లో ఇప్పటికే చాలా షాపులు ద్వంసం అయ్యాయి. ముంబాయి కి దాదాపు 350 కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణంలో జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 250 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. ఆందోళన చేస్తున్న వారు కనిపించిన షాపులన్నింటినీ ధ్వంసం చేయడం మొదలు పెట్టారు.
ఈ అల్లర్లను అదుపులోకి తేవడానికి పోలీసులు మొదటగా లాఠీ చార్జ్, ఆ తర్వాత కాల్పులు జరపాల్సి వచ్చింది. మరోవైపు 160 మంది పోలీసులు కూడా తమ విధి నిర్వాహణలో గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వివిధ ఆసుపత్రిలలో చేర్పించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ పట్టణంలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.