కావూరి సీటు ఫై ఓ ఎంఎల్ఏ కన్ను ?
posted on Dec 14, 2012 9:20AM
ఐదు సార్లు ఎంపి గా గెలిచిన తనకు కేంద్ర మంత్రి పదవి రాలేదని తీవ్ర అసహనంతో ఉన్న కావూరి సాంబశివ రావు కొంత కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో ఆయన ఏలూరు స్థానం నుండి పోటీ చేయకపోతే, ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వర రావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కావూరి పోటీ చేయకపోతే, ఇక్కడి నుండి ఎవరిని బరిలోకి దింపాలని ఇటీవల ఏలూరు వచ్చిన రాహుల్ గాంధీ దూతలు ప్రశ్నించగా, కొంత మంది నాయకులు నాగేశ్వర రావు పేరు చెప్పినట్లు తెలిసింది. ఆయన ఇక్కడి నుండి పోటీ చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
2014 లో ఈ స్థానం నుండి కావూరి మనవడు జగన్ పార్టీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కావూరి కాంగ్రెస్ లోనే కొనసాగితే, ఆయన తన మనవాడి ఫైనే పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితో కావూరి అసలు వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. ఆయన అసలు పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, కొల్లేరు సమస్య ఫై కావూరి చేసిన హెచ్చరికకు ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందిచడంతో ఆయన శాంతించి ఉంటారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.