సదస్సుకు కావూరి డుమ్మా
posted on Dec 15, 2012 @ 1:44PM
రేపు హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ సదస్సుకు తాను హాజరు కానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ప్రకటించారు.
పార్లమెంట్ సభ్యత్వంతో పాటు, పార్టీకి సంభందించిన ఇలాంటి సభ్యత్వాలన్నిటికీ తాను ఎప్పుడో రాజీనామా చేసానని ఆయన వివరించారు. కాబట్టి ఈ సదస్సుకు హాజరు కాలేనని ఆయన అన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుండి తన రాజీనామా అమల్లోకి వస్తుందని కావూరి ప్రకటించడం వల్ల ఈ సదస్సుకు హాజరుకావాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున ఆహ్వానం పంపించామని ముఖ్య నేత ఒకరు మీడియా కు వెల్లడించారు.
తన రాజీనామాను ఆమోదించకపోయినా, ఈ సదస్సుకు తనకు హాజరు కావాలని లేదని కావూరి అంటున్నారు. దీనితో, ఆయన సదస్సుకు హాజరవుతారా, లేదా అని పార్టీ వర్గాల్లో నడుస్తున్న సస్పెన్స్ కు ఇంతటితో తెర పడింది. సమావేశానికి హాజరు కావాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ కావూరిని స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, తన రాజకీయ భవిష్యత్తు ఫై జనవరి ఒకటి తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.