ఎట్టకేలకు జెఎన్యూ విద్యార్థులు దీక్ష విరమించారు.. 16 రోజుల తర్వాత...
posted on May 14, 2016 @ 11:54AM
జేఎన్యూ విద్యార్ది సంఘ నేత కన్నయ్య కుమార్ గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. యూనివర్శిటీ తమపై విధించిన జరిమానాకి గానూ.. తమను సస్పెండ్ చేసినందుకు గాను దానిని వ్యతిరేకిస్తూ కన్నయ్య కుమార్ దీక్షకు దిగారు. అయితే ఈ దీక్ష చేస్తున్న క్రమంలో కొందరు విద్యార్ధుల పరిస్థితి విషమంగా మారింది.. అయితే తొలుత కన్నయ్య తోపాటు నలుగురు విద్యార్ధులు దీక్ష విరమించగా.. మిగిలిన వారు దీక్షను కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థుల సస్పెన్షన్‌పై కండీషనల్ స్టే విధించింది. హైకోర్టు నుంచి వర్సిటీకి ఆదేశాలు అందిన వెంటనే తాము నిరాహార దీక్షను, ఆందోళనను విరమిస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
కాగా ఆఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన నేపథ్యంలో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ తో పాటు మరో ముగ్గురు విద్యార్ధులను నిందితులుగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే.. కన్నయ్యకుమార్ తో పాటు మిగిలిన విద్యార్థులకు శిక్ష, జరిమానా విధించిన సంగతి విధితమే.