కంచ ఐలయ్యపై కేసు నమోదు..
posted on May 17, 2016 @ 6:30PM
దళిత హక్కుల కార్యకర్త, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య బ్రాహ్మణులు, హిందూ దేవతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిని కూర్చునే సోమరుపోతులు బ్రాహ్మణులంటూ కంచ ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎపి బ్రాహ్మణ సేవా సంఘాలు ఐలయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చదువుకుంటే సంస్కారం వస్తుందని, విజ్ఞానం వికసిస్తుందని, కానీ కంచ ఐలయ్య చదువుకున్న మూర్ఖుడని మండిపడ్డారు. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను.. హైదరాబాద్, సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. లాయర్ కరుణసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో 295-A, 298, 153-A సెక్షన్ల కింద కంచ ఐలయ్యపై కేసు నమోదు చేశారు.