అమెరికాకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
posted on Aug 16, 2025 @ 3:35PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు బయలుదేరారు. పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయల్దేరిన ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులో భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండాఫ్ ఇచ్చారు. చిన్న కుమారుడని కాలేజీలో చేర్పించేందుకు వెళ్లున్నా కవిత 15రోజులు పాటు అక్కడే ఉండనున్నారు.మళ్లీ కవిత సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
నిన్న ఎర్రవళ్లి ఫామ్ హౌస్‌లో నిన్న కవిత, కేసీఆర్ కలిసేందుకు వెళ్లారు. అయితే గులాబీ బాస్ కూతురితో మాట్లాడలేదని సమాచారం. ఇంటి ప్రధాన ద్వారం వద్దే ఆమె ఉండిపోగా..కేసీఆర్, ఆర్యను తన గదికి పిలిపించుకొని 10 నిమిషాల పాటు మాట్లాడి, ఆశీర్వదించి పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫామ్ హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, హారీశ్‌రావు ఇతర నేతలు కవితతో మాట్లాడలేదని సమాచారం.