ఆరోగ్యానికి తీపి కబురు...'బెల్లం ముక్క'!!
posted on May 30, 2020 @ 9:30AM
ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ బెల్లమేఈరోజుల్లో బెల్లంవాడకం తగ్గిపోయింది. ఏదో పండగ సందర్భంలో తప్ప బెల్లం జోలికి వెళ్లడం చాలా తక్కువ. అయితే బెల్లానికి కదా అని తీసి పారేయకండి. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ముఖ్యంగా దీంతో శరీరానికి కావాలసిన వేడి అందుతుందని చెబుతారు. అంతేకాదు ఎన్నోరకాల రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గర్భవతి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిదట.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చలికాలంలో దగ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... రక్తప్రసరణ బాగా జరుగుతుందట. రోజంతా ఆఫీసుల్లో టెన్షన్ టెన్షన్ గా గడిపేవాళ్లకు ఇది ఎంతో మంచిదట.
బెల్లం తినాలంటే ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేదు. బెల్లం కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మార్కెట్లో ఇతర ధరలతో పోలిస్తే బెల్లం రేటు తక్కువే.
బెల్లం తియ్యగా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బయలుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాలట. బెల్లం తిని వెళ్తే మంచి శకునమని పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మన మాటలు కూడా చాలా తియ్యగా ఉంటాయట. కటువు మాటల వాడకం తగ్గుతుందట. ముఖ్యంగా ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్లం తినడం వల్ల మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మనశ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయమనాన్ని పెంచుతుందట. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా పనిని శ్రద్ధగా చేస్తాం.... మరియు ఈజీగా సక్సెస్ కూడా అవుతాం.
నేరుగా బెల్లం తినడం కంటే నువ్వుల లడ్డూ మరియు ఇతర ఆహార పదార్థాల్లో బెల్లాన్ని ఉపయోగిస్తే ఎంతో మంచిదట. దీంతో పిల్లలు కూడా మారాం చేయకుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చక్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయన పదార్థాల వాడకం ఉండదు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. ఇక నుంచి ఆ బెల్లమే కదా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.