రాజస్థాన్ రాయల్స్ కు 100 కోట్ల జరిమానా
posted on Feb 4, 2013 @ 3:49PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపించింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ 100 కోట్ల రూపాయల జరిమానా విధి౦చింది. ఈ మేరకు రాజసాన్ రాయల్స్ యాజమాన్యనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విదేశాల నుండి అక్రమంగా నిధులు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. ఇది ఫెమా ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. ఫెమా ఉల్లంఘన కింద ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జరిమానాగా విధించిన రూ.100 కోట్లను 45 రోజుల్లో చెల్లించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆదేశించింది.