మళ్లీ హైదరాబాద్ ను ముంచేసిన వర్షం..
posted on Sep 22, 2016 @ 4:20PM
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి చూస్తుంటే. ఇప్పటికే గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేని వర్షాల వల్లా నగరం మొత్తం నీట మునిగిపోతే.. మళ్లీ ఈరోజు భారీగా వర్షం పడి ఇంకా అతాలకుతలం చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నగరంలో పరిశీలించారు. నగరంలోని నాలాలు, నాలాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ వార్షిక సగటు వర్షాపాతం 32 సెం.మీ అని తెలిపారు. కానీ ఇవాళ ఒకే రోజు ఈ ప్రాంతంలో సుమారు 23 సెం.మీ వర్షం కురిసిందన్నారు. దీంతో నిజాంపేటతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.