హోం మంత్రిగా సబిత విఫలం ?

 

 

 

 

 

 

రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తన బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలం చెందారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ఆమె నియోజక వర్గంలో ఒక విద్యార్ధినిని రేప్ చేసి హత్య చేస్తే మంత్రి కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని నాయుడు అన్నారు. ఇది ఓ హోం మంత్రి చేయాల్సిన పని కాదని ఆయన అన్నారు.

 

ఆమెను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రేప్ సంఘటనను నిరసిస్తూ, ఆ గ్రామస్తులు దాదాపు ఏడు గంటల పాటు ఆ ప్రాంతంలో రాస్తారాకో చేసారని, ఆ ప్రాంతం హైదరాబాద్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ముఖ్య మంత్రి, మంత్రులెవరూ అక్కడకు వెళ్లకపోవడం దారుణమని ఆయన అన్నారు.

 

మహిళలఫై జరుగుతున్న దారుణాలకు దేశమంతా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్న సమయంలో కూడా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేతలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదని గాలి అన్నారు. మహిళలకు ఆత్మ రక్షణ కోర్సులు నేర్పించడానికి చర్యలు తీసుకొంటానని హోం మంత్రి తీరికగా కబుర్లు చెపుతున్నారని, అవి మొదలయ్యేనాటికి ఆమె తన పదవి కోల్పోతారని గాలి వ్యాఖ్యానించారు.